Tuesday 17th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > “కేటీఆర్ మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా?”

“కేటీఆర్ మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా?”

ktr vs siddu

‌- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు కర్నాటక సీఎం సిద్దరామయ్య కౌంటర్!

Siddaramaiah Vs KTR | కర్నాటక సీఎం సిద్ధ రామయ్య, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలిచ్చాం కానీ.. డబ్బులెక్క డి నుంచి వస్తాయంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడిన వీడియో కేటీఆర్ షేర్ చేశారు.

ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడానికి డబ్బుల్లేవని సిద్ధరామయ్య అంటున్నారు. హామీలు ఇచ్చే ముం దు ఆలోచించరా అని ప్రశ్నించారు కేటీఆర్. తెలంగాణ భవిష్యత్ కూడా ఇలాగే ఉండబోతుందా అని విమర్శించారు.

కేటీఆర్ షేర్ చేసిన వీడియోపై స్పందించారు సీఎం సిద్ధరామయ్య. తాను అలా అనలేదని తన వ్యాఖ్యలను బీజేపీనేతలు అశ్వత్ నారాయణ, సి.టి.రవి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

“కేటీఆర్.. మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా. మీకు ఏది ఫేక్, ఏది నిజం అని ఎలా ధృవీకరించాలో కూడా తెలియదు. బీజేపీ ఫేక్ వీడియోలు సృష్టిస్తుంది దాని బీ టీమ్ అయిన మీ బీఆరెస్ వాటిని షేర్ చేస్తుంది” అని ఎద్దేవా చేశారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions