Friday 25th April 2025
12:07:03 PM
Home > తెలంగాణ > ‘ఆయన రూపాయి.. నేను డాలర్’ పువ్వాడకు తుమ్మల కౌంటర్!

‘ఆయన రూపాయి.. నేను డాలర్’ పువ్వాడకు తుమ్మల కౌంటర్!

Tummala Vs Puvvada

Tummala Nageswar Rao | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం నియోజకవర్గం ఆసక్తిగా మారింది. ఈ స్థానం నుండి పోటీ చేస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay Kumar) ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

బీఆరెస్ అధినేత కేసీఆర్ సైతం తుమ్మల పై నేరుగా విమర్శలు గుప్పించారు. తుమ్మల ఒక ముల్లని, మంత్రి పదవి ఇస్తే ఖమ్మం జిల్లాలో బీఆరెస్ పార్టీ(BRS Party)కి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు కేసీఆర్ (KCR).

ఈ నేపథ్యంలో తుమ్మల ఒక చెల్లని రూపాయి అని, ముందు సత్తుపల్లి, తర్వాత ఖమ్మం, పోయిన సారి పాలేరు ఇలా పోటీ చేసిన చోట్ల ఓడిపోయారని, అక్కడ చెల్లని రూపాయి ఇప్పుడు ఖమ్మం లో ఎలా గెలుస్తుందని ఎద్దేవా చేశారు పువ్వాడ అజయ్.

కాగా పువ్వాడ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు తుమ్మల. తాను డాలర్ ని అని అది ఎక్కడికి పోయినా చెల్లుతుందన్నారు.  కానీ పువ్వడా మాత్రం ఉపయోగం లేని రూ.2000 నోటని సెటైర్లు గుప్పించారు తుమ్మల.

You may also like
విద్యార్థులు బ్లాంక్ చెక్స్ ఇవ్వాల్సిందే!
cpi narayana
ఇక్కడ తులసి మొక్కకు, గంజాయి మొక్కకు పోటీ! సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు!
ponguleti srinivas reddy
ఖమ్మంలో పోస్టర్ల కలకలం.. కన్నీరు పెట్టుకున్న పొంగులేటి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions