Rajamouli Accused of Harassment by Former Friend Srinivasa Rao | దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేశారు యు.శ్రీనివాసరావు.
రాజమౌళి మరియు ఆయన భార్య రమా రాజమౌళి తనను టార్చర్ చేస్తున్నారంటూ శ్రీనివాసరావు ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇది నా మరణ వాంగ్మూలం అంటూ ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
తనకు రాజమౌళి కి మధ్య 34 ఏళ్ల స్నేహితం ఉన్నట్లు చెప్పిన శ్రీనివాసరావు..శాంతి నివాసం సీరియల్ కంటే ముందు ఇద్దరం ఒకే అమ్మాయిని ఇష్టపడినట్లు తెలిపారు. అయితే రాజమౌళి కోసం తాను అమ్మాయిని త్యాగం చేశానని, ఇలా 55 ఏళ్ల వయసు వచ్చినా తాను సింగిల్ గానే మిగిలిపోయానని వాపోయారు.
రాజమౌళి ఇండియాలోనే నంబర్ వన్ దర్శకుడు అయిన నేపథ్యంలో అమ్మాయి విషయం ఎవరికో చెప్పానని, సదరు విషయం బయటకు పొక్కకూడదంటూ రాజమౌళి తనను టార్చర్ చేస్తున్నాడని శ్రీనివాస రావు ఆరోపించారు. తన 30 ఏళ్ల జీవితాన్ని రాజమౌళి కోసం త్యాగం చేశానని, కానీ చిన్న చిన్న గొడవల మూలంగా రాజమౌళి ఫ్యామిలీ కూడా తనకు దూరం అయిందన్నారు.
తమ స్నేహం గురించి కీరవాణి సహా పలువురు సినీ పెద్దలకు తెలుసన్నారు. ఒక ఫ్రెండ్ వల్ల తన జీవితం నాశనమయ్యిందని రాజమౌళిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమ్మాయిల జోలికి వెళ్ళొద్దని, కెరీర్ మీద దృష్టి పెట్టాలని శ్రీనివాసరావు వీడియోలో చెప్పారు. అయితే శ్రీనివాసరావు చేసిన ఆరోపణలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.