TSRTC News| నుతంగాన ఏర్పడిన తెలంగాణ ( Telangana ) ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద డిసెంబర్ 7న ఆర్టీసీ ( Rtc ) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించిన విషయం తెల్సిందే.
దింతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి మహిళలకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పథకం ప్రారంభం అయినప్పటి నుండి, ఆర్టీసీ బస్సుల్లో సుమారు 60 శాతం మంది మహిళలే ప్రయనిస్తున్నారని, అలాగే 100 పెర్సెంట్ కెపాసిటీ ( Capacity ) తో బస్సులు నడుస్తున్నట్లు తెలిపింది టీఎస్ ఆర్టీసీ.
ఇదిలా ఉండగా ఉచిత ప్రయాణ సదుపాయంతో మహిళలు అధికంగా ఆర్టీసీలో బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, దింతో పురుషులకు ప్రత్యేక సీట్లను ( Seats ) కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు పలువురు పురుషులు.
ఈ నేపథ్యంలో డబ్బులు పెట్టి టిక్కెట్ తీసుకొని మరి నిలబడాల్సొస్తుందని, 100ల కి.మీ. నిలబడి పురుషులు ఎలా ప్రయాణించాలంటూ ప్రశ్నించారు ఒక వ్యక్తి.
ఈ మేరకు ఆర్టీసీ బస్సులో పురుషులు నిల్చొని వెళ్తున్న ఘటనను వీడియో ( Video ) తీసి మరి పురుషులకు ప్రత్యేక సీట్లను కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) కి విజ్ఞప్తి చేసారు ఒక వ్యక్తి.
కాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ ( Viral ) గా మారింది.