True Indian wouldn’t…: Supreme court raps Rahul Gandhi over China claim | కాంగ్రెస్ అగ్ర నాయకులు, లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.
2 వేల కి.మీ. మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ గాంధీ గతంలో సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. అయితే రాహుల్ వ్యాఖ్యల్ని తాజగా సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అసలు చైనా ఆక్రమించినట్లు రాహుల్ గాంధీకి ఎలా తెలుసు అని ప్రశ్నించింది. ని
జమైన భారతీయలు ఎవరూ ఇలా మాట్లాడరని పేర్కొంది. కాగా 2022లో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టారు. ఈ సమయంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘2020లో లడఖ్ లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ సమయంలో చైనా 2 వేల కి.మీ. మేర దేశ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. అయినప్పటికీ దీనిపై కేంద్రం స్పందించలేదు. పైగా ప్రధాని మోదీ దీనిపై అసత్యాలు చెబుతున్నారు’ అని రాహుల్ ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు సైన్యాన్ని అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ అనే వ్యక్తి న్యాయస్థానం లో ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ ప్రశ్నించకపోతే ఎలా అని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. దింతో ఇటువంటి సమస్యలను పార్లమెంటు వేదికగా ప్రశ్నించాలే తప్ప సోషల్ మీడియా వేదికగా కాదని కోర్టు స్పష్టం చేసింది.









