Akbar-Sita Lions Row | మగ సింహానికి అక్బర్, ఆడ సింహానికి సీత అని పేరు పెట్టిన అధికారిని సస్పెండ్ చేసింది త్రిపుర ప్రభుత్వం. వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి 12 న జంతువుల మార్పిడి లో భాగంగా త్రిపురా రాష్ట్రంలోని సేపాహిజాల జూ పార్క్ నుండి రెండు సింహాలను వెస్ట్ బెంగాల్ లోని శిలుగురి సఫారీ పార్క్ కు తీసుకువచ్చారు. వాటికి అక్బర్, సీత అని పేర్లు పెట్టారు.
ఆ రెండింటీని ఓకే ఎన్ క్లోజర్ లో ఉంచడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది విశ్వ హిందూ పరిషత్. ఈ చర్య మూలంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కోల్ కతా హై కోర్టు ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం అనవసరపు వివాదాలు సృష్టించే విదంగా సింహాలకు పేర్లు పెట్టడం ఏంటని ప్రశ్నించింది. వెంటనే పేర్లు మార్చాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో స్పందించిన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం.. త్రిపుర నుండి తీసుకువచ్చేటప్పడికే ఆ సింహాలకు అక్బర్, సీత అని పేర్లు పెట్టారని తెలిపింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన త్రిపుర ప్రభుత్వం సింహాలకు ఆ పేర్లు పెట్టిన రాష్ట్ర అటవీ వ్యవహారాల ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రబిన్ లాల్ అగర్వాల్ ను సస్పెండ్ చేసింది. కాగా ఆ సింహాలకు పేర్లను మారుస్తామని క్లారిటి ఇచ్చింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం.