Yevgeny Prigozhin | ఏడాది కిందట ప్రారంభమైన రష్యా – ఉక్రెయిన్ యుద్ధం (Russia – Ukraine War) నేటికీ నిర్వివిరామంగా కొనసాగుతోంది.
ఉక్రెయిన్ కొద్దీ రోజుల్లోనే తమ అధీనం లోకి వస్తుందని భావించి యుద్ధం మొదలుపెట్టింది రష్యా.. కానీ నాటో దేశాల మద్దతుతో ఉక్రెయిన్ యుద్ధంలో ఎక్కడా వెనుకడుగు వెయ్యట్లే.
రష్యా బలగాలను సాధ్యమైనంత మేరకు ఎదుర్కొటూ ధీటుగా బదులిస్తోంది.
ఇదిలా ఉండగా రష్యా బలగాలు ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న తరుణంలో స్వదేశంలో పుతిన్ (Putin)కి ఊహించని షాక్ ఎదురైంది.
వాగ్నర్ గ్రూప్ (Wagner Group) అధినేత యెవ్గెనీ ప్రిగోజిన్ (Yevgeny Prigozhin) పుతిన్ పై తిరుగుబాటు చేశారు.
ప్రిగోజిన్ నాయకత్వం లోని వాగ్నర్ గ్రూప్.. రష్యా భూభాగం లొనే రష్యా మిలిటరీ పైకి ఒక్కసారిగి తిరుగుబాటు చేసింది.
Read Also: షర్మిలను కలవరిస్తున్న కాంగ్రెస్.. వైఎస్ఆర్టీపీ విజయం సాధించినట్టే!
రొస్తోవ్ ప్రాంతాన్ని తమ అధీనం లోకి తీసుకొని, రష్యా రక్షణ మంత్రి పైన, వారి వ్యవస్థ పైన వ్యతిరేకత తోనే ఈ చర్యలకు దిగుతున్నట్లు ప్రకటించారు.
ప్రిగోజిన్ తిరుగుబావుటాపై పుతిన్ మాట్లాడుతూ దేశ మిలిటిరీ కి వ్యతిరేకంగా ఎవరూ ఆయుధాలు పట్టిన వారిని దేశద్రోహులు గా చూస్తామని ప్రకటించారు.
దేశ ప్రజల రక్షణకు ఎవరు ఆటంకం కలిగించిన వారి పైన కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
ఏంటీ వాగ్నర్ గ్రూప్.. ఎవరీ ప్రిగోజిన్..!
ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు ప్రిగోజిన్. 1980ల్లో దాదాపు 9 సంవత్సరాలు దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ జైల్లో ఉన్నాడు.
1990లో అతడికి పుతిన్ కి పరిచయం ఏర్పడింది. 2000 లో పుతిన్ రష్యా కి అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు ప్రిగోజిన్ వ్యాపారంలో స్థిరపడ్డాడు.
ఫుడ్, రెస్టారెంట్ లకు సంబంధించిన వ్యాపారాలు చేసేవాడు. పుతిన్ రష్యా అధ్యకుడు అయ్యాక ప్రిగోజిన్ తన వ్యాపారాన్ని ప్రభుత్వ సహాయ సహకారాలతో మరింత విస్తరించాడు.
ఇదిలా ఉండగా వాగ్నర్ గ్రూప్ అనేది ఒక ప్రైవేట్ ఆర్మీ లాంటిది. ఇది పుతిన్ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేస్తుంది.
ఇందులో అధికులు మాజీ సైనికులే. 1994-96, 1999-2009లో జరిగిన చెచెన్ యుద్ధం లో కీలకంగా వ్యవహరించిన దిమిత్రి ఉత్కిన్ దీనిని ప్రారంభించారు. దిమిత్రి, ప్రిగోజిన్ మంచి సన్నిహితులు.
2014లో వాగ్నర్ గ్రూప్ కి ప్రిగోజిన్ కి సంబంధాలు బయటకి వచ్చాయి. కానీ అంతకంటే ముందు నుండే అతను వాగ్నర్ గ్రూప్ బాధ్యతలు నిర్వహించేవాడు.
ఏదైనా అంశంలో ఒకవేళ రష్యా మిలిటరీ నేరుగా రంగం లోకి దిగితే ప్రపంచానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
అలాగే అంతర్జాతీయ చట్టాలు అడ్డు వస్తాయి. అదే ప్రైవేట్ సైన్యం అయితే ఎలాంటి నిబంధనలు ఉండవు. అందుకే పుతిన్ వాగ్నర్ గ్రూప్ ని ప్రోత్సహించాడు.
ప్రిగోజిన్ నాయకత్వం లో వాగ్నార్ గ్రూప్ చాలా దేశాల్లో పుతిన్ నిర్దేశించే పనిని పూర్తిచేసేది. క్రిమియా ఆక్రమణలో వాగ్నర్ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది.
అలాగే సిరియాలో బాషార్ అల్ అస్సద్ కి మద్దతుగా, లిబియా సివిల్ వార్ లో, వెనిజులా ఇలా చాలా దేశాల్లో పుతిన్ ఆదేశాల మేరకు వీరు తమ కార్యకలాపాలు చేస్తారు.
ఈ గ్రూప్ లో సుమారు 6000 మంది సైనికులు ఉండవచ్చు అని బ్లూమ్ బెర్గ్ (Bloomberg) వెల్లడించింది. ప్రిగోజిన్ రష్యా సైనిక అధికారులు లక్ష్యంగా ఈ తిరుగుబాటు చేశాం అని చెప్పాడు.
ఉక్రెయిన్ యుద్ధం లో భాగంగా రక్షణ శాఖ తన వాగ్నర్ సైన్యం లోని చాలా మందిని ఉద్దేశపూర్వకంగా హతమార్చడంతో ఈ తిరుగుబాటు బావుటా ఎగరవేశాం అని ప్రకటించాడు.
అందులో భాగంగానే వాగ్నర్ గ్రూప్ రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గి షోయుగు నివాసం ఉండే రొస్తోవ్ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుంది.
మరోవైపు రష్యా సైన్యంపై తిరుగుబాటు చేస్తున్న వాగ్నర్ గ్రూప్‌కు స్టోమ్ జెడ్ మద్దతు ప్రకటించింది. రష్యా జైళ్లలో బలవంతంగా నిర్భందించిన ఖైదీల సమూహమే ఈ స్టోమ్ జెడ్.
వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్‌కు తమ మద్దతు ప్రకటిస్తూ స్టోమ్ జెడ్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసింది.
ఈ పోరాటంలో ప్రిగోజిన్‌కు మద్దతుగా ఆయన వెంట రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
Read Also: Congress మైండ్ గేమ్ పాలిటిక్స్.. మాణిక్ రావు ఠాక్రేకు రాములమ్మ కౌంటర్!
పుతిన్ హెచ్చరిక..
వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు విషయాన్ని తెలుసుకున్న పుతిన్ చాలా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలు కేవలం దేశద్రోహులు మాత్రమే చెయ్యగలరని వ్యాఖ్యానించారు.
దేశ ఆర్మీ కి వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి చర్యలు చేసినా అది చాలా పెద్ద నేరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. వారికి శిక్ష తప్పదనీ, వాగ్నార్ గ్రూప్ ని ఉద్దేశించి పేరు ప్రస్తావించకుండా వార్నింగ్ ఇచ్చారు.
పుతిన్ స్పందించిన వెంటనే ప్రిగోజిన్ ఒక వీడియో ని విడుదల చేశాడు. అందులో మాట్లాడుతూ పుతిన్ “మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. మేం నిజమైన దేశ భక్తులం. మా చర్య సరైనదే.
ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అబద్దాలకు, అవినీతికి వ్యతిరేకంగా మేం పోరాడుతున్నాం. మేం లొంగిపోయే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు.
రష్యా లాంటి శక్తివంతమైన దేశం, పుతిన్ లాంటి బలమైన వ్యక్తికి ఎదురుగా వెళ్లి నిలబడటం అంటే అది చాలా పెద్ద విషయం.
అలాంటిది ప్రిగోజిన్ ఒంటరిగా ఇలాంటి చర్యలకు దిగుతాడా?? లేదంటే అతనికి ఎవరు అన్న మద్దతు ఉందా అనేది భవిష్యత్ లో తేలుతుంది.






