The US-China tariff war | అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఏదొక సంచలన నిర్ణయం తీసుకుంటూ యావత్ ప్రపంచాన్నే వణికిస్తున్నారు.
ప్రపంచ దేశాలు అమెరికా దిగుమతులపై విధిస్తున్న టారిఫ్స్ కు ప్రతీకారంగా ట్రంప్ వివిధ దేశాలకు ఒక్కో రకంగా ప్రతీకార సుంకాల విధించారు. ఈ నేపథ్యంలో అమెరికా-చైనాల మధ్య సుంకాల పోరు మొదలయింది. తాజగా అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు విధించనున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.
ఈ నిర్ణయం ఏప్రిల్ 10నుండి అమల్లోకి రానుంది. ప్రతీకార సుంకాల నిర్జయంలో భాగంగా ట్రంప్ చైనా నుండి దిగుమతయ్యే ఉత్పత్తులపై 54 శాతం టారిఫ్ విధించారు. ఈ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా అమెరికా పై 34 శాతం అదనంగా సుంకాలు విధించింది.
ఈ నిర్ణయం భగ్గుమన్న ట్రంప్ ఏప్రిల్ 8 లోగా చైనా తన నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అయితే చైనా స్పందించకపోవడంతో ట్రంప్ 54 శాతానికి అదనంగా మరో 50 శాతం సుంకాలు విధించారు. దింతో మొత్తం 104 శాతానికి చేరుకుంది. ప్రతీకారంగా చైనా కూడా మరో 50 శాతం సుంకాన్ని విధించింది.
దింతో అమెరికా ఉత్పత్తులపై చైనా మొత్తం 84 శాతం టారిఫ్స్ విధించినట్లైంది. ఇటీవల ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలయి. తాజగా సుంకాల విషయంలో అమెరికా-చైనా మధ్య పోరు నడుస్తున్న తరుణంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏం అవుతుందో అనే భయాలు నెలకొన్నాయి.