Tuesday 7th April 2026
12:07:03 PM
Home > తాజా > ప్రయాణీకులకు ఆర్టీసీ శుభవార్త!

ప్రయాణీకులకు ఆర్టీసీ శుభవార్త!

tgsrtc green metro


– బస్సు ఛార్జీ తగ్గించే యోచనలో సంస్థ?

TGSRTC Summer Offer | హైదరాబాద్ నగరంలో ఆర్టీసీలో ప్రయాణించే వారికి సంస్థ ఓ శుభవార్త చెప్పనుంది. వేసవి నేపథ్యంలో ఉద్యోగాలు, వివిధ పనుల నిమిత్తం ఆర్టీసీలో ప్రయాణాలను ప్రోత్సహించేందుకు ఓ ఆఫర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

వేసవి కాలంలో నగర వ్యాప్తంగా బస్సు ఛార్జీలు తగ్గించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మార్చి ఒకటో తేదీ నుంచి అంటే మే నెలాఖరు వరకు హైదరాబాద్ సిటీ ఏసీ సర్వీసుల్లో టికెట్ ఛార్జీలు 30 శాతం తగ్గించనున్నట్లు తెలుస్తోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో మాత్రమే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. తద్వారా మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ ఛార్జీలకు సమానంగా ఏసీ బస్సుల్లోనూ ఛార్జీలు ఉండనున్నాయి. ఎయిర్‌పోర్ట్‌ కు తిరిగే పుష్పక్‌ ఏసీ బస్సులు మినహా మిగతా అన్ని ఏసీ బస్సుల్లో ఈ టికెట్ తగ్గింపును అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు తిరుగుతుండగా వీటిలోనే ఛార్జీల తగ్గింపును ఆర్టీసీ అధికారులు అమలుచేయనున్నారు.

You may also like
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tgspdcl
ఏప్రిల్ 8 నుంచి విద్యుత్ ఆర్టిసన్ల నిరవధిక సమ్మె!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions