Wednesday 8th April 2026
12:07:03 PM
Home > తాజా > శ్రీరామ భక్తులకు శుభవార్త.. ఇంటికే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు!

శ్రీరామ భక్తులకు శుభవార్త.. ఇంటికే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు!

seetharamaula thalambralu

Seetharamula Thalambralu | శ్రీరామ భక్తులకు తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ (TGSRTC) కీలక ప్రకటన చేసింది.

శ్రీరామ నవమి (Srirama Navami) సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను (Seetharamula Thalambralu) భక్తులకు అందజేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది.

ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములవారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది.

ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాల ప్యాకెట్లు’ పొందాలనుకునే భక్తులు www.tgartclogistics.co.in వెబ్ సైట్లో లాగిన్ అయి ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.

అలాగే టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది.

హైదరాబాద్ లోని బస్ భవన్ లో శనివారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను టీఎస్ ఆర్టీసీ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి, ఐపీఎస్ ఆవిష్కరించారు.

You may also like
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tgspdcl
ఏప్రిల్ 8 నుంచి విద్యుత్ ఆర్టిసన్ల నిరవధిక సమ్మె!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions