Tuesday 3rd March 2026
12:07:03 PM
Home > తాజా > దివ్యాంగులకు ఉచిత ప్రయాణం..ప్రభుత్వం క్లారిటీ!

దివ్యాంగులకు ఉచిత ప్రయాణం..ప్రభుత్వం క్లారిటీ!

tgsrtc

TGSRTS | తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో (Mahalaxmi Scheme) భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో దివ్యంగులకు కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఈ ప్రచారంపై తాజగా టీజీఎస్ ఆర్టీసీ స్పందించింది. దివ్యంగులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని, సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేసింది.

ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది. ప్రజలు ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని, అధికారికంగా వెలువడిన వార్తలను మాత్రమే నమ్మాలని యాజమాన్యం కోరింది.

You may also like
seetharamaula thalambralu
శ్రీరామ భక్తులకు శుభవార్త.. ఇంటికే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు!
మహిళలకు ఉచిత ప్రయాణంలో కీలక మార్పు.. ఇక మరింత సులభం!
tgsrtc green metro
ప్రయాణీకులకు ఆర్టీసీ శుభవార్త!
tgsrtc green metro
మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై కీలక నిర్ణయం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions