High Court Order To Hydraa | హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను, ఎఫ్టీఎల్ (FTL), బఫర్ జోన్ (Buffer Zone) లలో కట్టడాలను గత కొద్ది రోజులుగా హైడ్రా నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నివాస గృహాలను కూడా హైడ్రా కూల్చేసిందే.
ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. వచ్చే సోమవారం అంటే సెప్టెంబర్ 30న ఉదయం 10.30 గంటలకు కోర్డు ఎదుట హాజరవ్వాలంటూ రంగనాథ్‌ను ఆదేశించింది. ఇటీవల అమీన్‌పూర్‌లో హైడ్రా ఓ భవనాన్ని హైడ్రా కూల్చివేసింది.
కాగా, ఆ భవనంపై కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీంతో కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయం మీద.. వ్యక్తిగతంగానైనా లేదా వర్చువల్‌గానైనా కోర్టుకు సమాధానం చెప్పాలని ఉన్నత న్యాయస్థానం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని ఆదేశించింది.