Telangana TET Notification 2024 | తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు సర్కారు శుభవార్త చెప్పింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ ( Notiication )ను విడుదల చేసింది.
ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) ఏడాదికి రెండు సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (TET) నిర్వహిస్తామని అభ్యర్థులకు మాట ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ ఏడాదిలో రెండోసారి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. అయితే ఈ టెట్ పరీక్షలు జనవరిలో జరగనున్నాయి.
2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ ( Online )లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకు నిర్వహించిన టెట్ పరీక్షలకు 2.35 లక్షల మంది హాజరు కాగా, 1.09 లక్షల మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరిగా ఉండాలని చెప్పడంతో, వేలాది మంది సర్వీసులు ఉన్న ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్షలకు హాజరవుతున్నారు.










