Tuesday 7th April 2026
12:07:03 PM
Home > తాజా > మహిళలకు ఉచిత ప్రయాణంలో కీలక మార్పు.. ఇక మరింత సులభం!

మహిళలకు ఉచిత ప్రయాణంలో కీలక మార్పు.. ఇక మరింత సులభం!

Smart Cards for Free Bus Journey | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) కింద మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో కీలక మార్పు రానుంది.

ఇప్పటివరకు గుర్తింపు కోసం వాడుతున్న ఆధార్ కార్డుల స్థానంలో ప్రభుత్వం ‘మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను’ ప్రవేశపెట్టనుంది. మార్చి 1 నుంచి ఎంపిక చేసిన కొన్ని మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్డులను జారీ చేయనున్నారు.

నకిలీ ఆధార్ కార్డులతో ఇతర రాష్ట్రాల మహిళలు ఉచిత ప్రయాణం చేయకుండా అరికట్టడం ఈ కార్డుల ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్ కార్డుల్లో ఉండే చిప్ సహాయంతో కండక్టరు కొత్త ఇంటలీజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ ద్వారా సులభంగా జీరో టికెట్లను జారీ చేయవచ్చు.

ఈ స్మార్ట్ కార్డుల ద్వారా ఏయే రూట్లలో ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారో ప్రభుత్వం కచ్చితంగా ట్రాక్ చేయగలదు. మహిళలు ఆన్‌లైన్ ద్వారా లేదా నిర్దేశిత కేంద్రాల్లో ఆధార్ కార్డు, ఫోటో సమర్పించి ఈ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి.

ఈ కార్డుల వల్ల మరింత పారదర్శకత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక, జూన్ 2 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కార్డుల పంపిణీ చేసే అవకాశం ఉంది.

You may also like
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tgspdcl
ఏప్రిల్ 8 నుంచి విద్యుత్ ఆర్టిసన్ల నిరవధిక సమ్మె!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions