Friday 22nd November 2024
12:07:03 PM
Home > తాజా > తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి.. అతి త్వరలో నోటిఫికేషన్!

తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి.. అతి త్వరలో నోటిఫికేషన్!

Voting

Sarpanch Elections In Telangana | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వం దిగ్విజయంగా ముగిసింది. రాష్ట్రంలో డిసెంబర్ 7 నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో రానున్న కొత్త సంవత్సరంలో మరోసారి ఎన్నికల సందడి ప్రారంభం కానుంది.

రాష్ట్రవ్యాప్తంగా  సర్పంచ్ ఎన్నికలకు అతి త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. పంచాయతీల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారుల నియామకం, ఎన్నికల విధుల్లో పాల్గొననున్న సిబ్బందికి శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలను ప్రారంభించాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం సూచించింది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ కార్యదర్శులు ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించిన రిజర్వేషన్లపై వివరాలు పంపించారు.

ఐదేళ్ల కిందట 2019లో తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. గ్రామాల్లో ఫిబ్రవరి 1 నాటికి  ప్రస్తుత సర్పంచుల కాలం ముగియనుంది. దీంతో ఫిబ్రవరిలోనే కొత్త సర్పంచ్, కార్యవర్గం కొలువుదీరాల్సి ఉంది. నిబంధనల ప్రకారం.. ఈలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు పదేళ్లకు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం 2019లో చట్టం చేసింది. ఈ నేపథ్యంలో కిందటిసారి రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది.

ఒకవేళ కొత్త ప్రభుత్వం రిజర్వేషన్లను మార్చాలని నిర్ణయం తీసుకుంటే, అధికారులు నిర్ణీత సమయంలో కొత్త రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు అందించాల్సి ఉటుంది.

లేని పక్షంలో రిజర్వేషన్లు మారే అవకాశం దాదాపుగా లేకపోవచ్చు. డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్  విడుదల అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

You may also like
జగన్ కు అదానీ లంచం..వైసీపీ కీలక వ్యాఖ్యలు
నాగచైతన్య-శోభిత పెళ్లిపై నాగార్జున ఏమన్నారంటే !
నన్ను కాపాడండి..ప్రాణాలు పోతున్నాయన్నా చలించని మనుషులు
అఖండ భారతంలో అదానీకో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions