Telangana DGP | తెలంగాణా డీజీపీ రవి గుప్తా (Ravi Gupta) శుక్రవారం ఉదయం వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలను పోలీసులు, మీడియా సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని తెలిపారు.
గతేడాదితో పోలిస్తే 8.97 శాతం రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ పెరిగిందని వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 2,13,121 కేసులు నమోదు చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు 17. 59 శాతం పెరిగాయన్నారు.
ఇక జీరో ఎఫ్ఐఆర్(Zero FIR)లు 1108 నమోదు చేశామని చెప్పారు. ఐపీసీ సెక్షన్ కింద 1,38,312 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. 73 రేప్ కేసుల్లో 84 మందికి జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కేసులు 1877 నమోదు చేశామని పేర్కొన్నారు.