Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణలో కొత్త మంత్రులు..ప్రమాణ స్వీకారం అప్పుడేనా?

తెలంగాణలో కొత్త మంత్రులు..ప్రమాణ స్వీకారం అప్పుడేనా?

Telangana cabinet expansion | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు ఏడాదిన్నర అవుతుంది. అయితే ఇప్పటికీ మంత్రివర్గంలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇద్దరు బీసీ, రెడ్డి, ఎస్సికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలను ఏఐసీసీ సేకరించింది.

ఇకపోతే రెడ్డి సామాజిక వర్గం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి మరియు మలరెడ్డి రంగారెడ్డి రేసులో ఉన్నారు. బీసీల్లో శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఎస్సిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు కేబినెట్ లో చోటు దక్కే ఛాన్స్ ఉంది.

మంగళవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా లాబీలో ఎదురుపడిన గడ్డం వివేక్ కు మాజీ మంత్రి మల్లారెడ్డి శుభాకాంక్షలు చెప్పిన విషయం తెల్సిందే. మంత్రి పదవిని మొత్తానికి సాదించావు అంటూ వివేక్ ను ఉద్దేశించి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions