TS Auto Drivers | తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తన ఎన్నికల హామీల్లో భాగంగా ఆర్టీసీ (TSRTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. మహాలక్ష్మీ పథకంలో భాగంగా డిసెంబర్ 9 నుంచి వారికి ఫ్రీ జర్నీ సౌకర్యం అమలు చేస్తున్నారు.
ఈ పథకంతో మహిళలు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. దీంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ తగ్గిపోయిందని ఆందోళనకు దిగుతున్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ పొట్టే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణీకులు ఎక్కకపోవటంతో తమకు రోజూవారీ ఆదాయం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఈ అరకొర ఆదాయంతో తాము కుటుంబాలని ఎలా పోషించుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఆటోడ్రైవర్లు (TS Auto Drivers)పలుమార్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ప్రభుత్వ పెద్దలను కూడా కలిశారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంతో ప్రభుత్వం నుంచి అనుకూల స్పందన రాకపోటవంతో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కొత్త ఏడాదిలో సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చేందకు సిద్ధమయ్యారు. ఈ నెల 4న ఇందిరా పార్క్ (Indira Park) వద్ద ఆటోడ్రైవర్లు మహాధర్నాకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మహాధర్నా చేపట్టనున్నట్లు ఆటో కార్మికులు వెల్లడించారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం వల్ల తాము నష్టపోతున్నామని తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మహాలక్ష్మ స్కీం కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రతినెలా రూ.15వేలు జీవనభృతి ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే తమ ఆందోళనను ఉద్దృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.