Friday 9th May 2025
12:07:03 PM
Home > తాజా > Telangana: అవినీతి నిరోధక శాఖ ఆల్ టైం రికార్డ్!

Telangana: అవినీతి నిరోధక శాఖ ఆల్ టైం రికార్డ్!

acb telangana

TG ACB All-time Record | తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (Anti Corruption Bureau) ఆల్ టైం రికార్డ్ ను సృష్టించింది. 2024లో తొలి ఎనిమిది నెలల్లోనే లంచం తీసుకుంటున్న 85 మంది ప్రభుత్వ ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్ గా ACB పట్టుకుంది.

రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈ స్థాయిలో అరెస్ట్ జరగడం ఇదే తొలిసారి. మొత్తంగా 145 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు చెందినవే 32 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత హోంశాఖకు చెందిన ఉద్యోగులపై 21 కేసులు, మున్సిపల్ ఉద్యోగులపై 18 కేసులు ఏసీబీ నమోదు చేసింది.

ఈ ఏడాదిలో మొత్తం 109మందిని అరెస్ట్ చేయగా వారిలో 85మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా, మరో 24మంది ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేయడం హైలైట్ గా మారింది.

కాగా గతేడాది డిసెంబర్ చివరి వారంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా సీవీ ఆనంద్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుండి అవినీతి నిరోధక శాఖ పంథం మార్చుకుని వేగాన్ని పెంచింది.

You may also like
‘గెలవాలని మొక్కుకున్న 96 ఏళ్ల వృద్ధురాలు..అభిమానిని కలిసిన పవన్’
అయ్యా మాకు లోన్లు ఇవ్వండి..పాక్ భిక్షాటన !
‘ఒక నెల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళం గా ఇద్దాం’
‘భారత్ vs పాక్..అంబటి రాయుడిపై ఫైర్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions