Team India Lose 20th Consecutive ODI Toss | వరుసగా 20వ సారి టాస్ ఓడిపోవడంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ కాస్త అసహనానికి గురయ్యారు. టీం ఇండియా-సౌత్ ఆఫ్రికా మధ్య రెండవ వన్డే రైపూర్ వేదికగా బుధవారం జరిగింది. టాస్ ఓడిన టీం ఇండియా బ్యాటింగ్ కు దిగింది. అయితే వన్డేల్లో టీం ఇండియా వరుసగా 20 సార్లు టాస్ ఓడింది. ఇలా వరుసగా టాస్ ఓడడం అనేది యావత్ క్రికెట్ ప్రపంచంలోనే చాలా వింత. కారణం వరుసగా 20 సార్లు టాస్ ఓడే సంభావ్యత 1048576లో ఒక్కసారి మాత్రమే. అంటే వరుసగా 20 సార్లు టాస్ ఓడిపోవడానికి ఉండే అవకాశం కేవలం 0.000095% శాతం మాత్రమే.
2023 వరల్డ్ కప్ లో భాగంగా నవంబర్ 15న టీం ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్స్ లో చివరిసారిగా భారత్ టాస్ గెలిచింది. రెండు ఏళ్లకు పైగా గడిచినా టాస్ గండం మాత్రం వదలడం లేదు. ఈ క్రమంలో స్పందించిన కేఎల్ రాహుల్ తనకు మ్యాచ్ కంటే ఎక్కువగా టాస్ గెలవాలనే ఒత్తిడి అధికంగా ఉందని పేర్కొన్నారు. మ్యాచ్ కంటే ముందు టాస్ ను పలుసార్లు ప్రాక్టీస్ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు.









