AP CM Chandra Babu | టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandra Babu Naidu) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా (AP CM) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్నాథ్ షిండే, పలువురు కేంద్రమంత్రులు, సినీ ప్రముఖుల సమక్షంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
కాగా, ముఖ్యమంత్రిగా నాలుగవ సారి, నవ్యాంధ్ర సీఎంగా రెండవ సారి టీడీపీ అధినేత చంద్రబాబు బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. 1995 లో తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, 1999 తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 2004 నుండి 2014 వరకు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. అనంతరం విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి 2014 లో ప్రమాణ స్వీకారం చేశారు.
మళ్ళీ 2019 నుండి 2024 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తాజాగా 2024 ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయంతో నేడు చంద్రబాబు నాలుగవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు.