Tuesday 7th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. అధికార విపక్ష పార్టీల మధ్య పొత్తు!

తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. అధికార విపక్ష పార్టీల మధ్య పొత్తు!

dmdk dmk alliance

DMK DMDK Alliance | తమిళనాడు(Tamilnadu)లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భిన్న ధ్రువాలు ఏకమయ్యాయి. అధికార విపక్ష పార్టీ కలిసిపోయాయి.

ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న డిఎంకే (DMK), డీఎండీకే (DMDK) పార్టీల మధ్య పొత్తు కుదిరింది. గురువారం చెన్నైలోని సీఎం ఎం.కె.స్టాలిన్ (CM Stalin) నివాసంలో డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్ ఆయనతో సమావేశమయ్యారు.

ఈ భేటీ తర్వాత ఇరు పార్టీలు కలిసి పనిచేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా డీఎండీకే అధినేత్రి ప్రేమలత మాట్లాడుతూ   ద్రావిడ మోడల్ పాలన కొనసాగేందుకు, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

కెప్టెన్ విజయకాంత్ (Captain Vijaykanth) జీవించి ఉన్నప్పుడే ఈ కూటమి ఏర్పడాల్సిందన్న ఆమె, పదేళ్ల తర్వాత  అది సాధ్యమైందని పేర్కొన్నారు. తమ కూటమి 200కు పైగా స్థానాల్లో గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, 2011 నుంచి డీఎండీకే పార్టీ అన్నాడీఎంకే మిత్రపక్షంగా కొనసాగింది. ఈ పొత్తులో భాగంగా డీఎండీకేకు 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక రాజ్యసభ సీటును కేటాయించన్నట్లు తెలుస్తోంది.

You may also like
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
vijay hot comments on cm stalin
స్టాలిన్‌ వర్సెస్ విజయ్: తమిళ రాజకీయాల్లో హీట్ పెంచిన ‘దళపతి’!
stalin
రాజ్యాంగాన్ని సవరించాల్సిందే.. సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు!
vijay
‘ఇలాంటి విషాదాన్ని ఎప్పుడూ చూడలేదు..’ కరూర్ ఘటనపై విజయ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions