Taliban Claims Waziristan Suicide Bombing As Pakistan Blames India | పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని వజిరిస్తాన్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆ దేశ సైనికులు 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
అయితే ఈ దాడి వెనుక భారత్ ఉందని దాయాధి దేశం ఆరోపించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆరోపణలను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో ఓ ఉగ్రవాది సైనిక వాహనాలపైకి దూసుకెళ్లాడు.
ఈ క్రమంలో భారీగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది పాక్ సైనికులు అక్కడిక్కడే మృతి చెందినట్లు ఆ దేశ సైనికాధికారులు పేర్కొన్నారు. అలాగే 24 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. చికిత్స పొందుతున్న సమయంలో మరో ముగ్గురు మృతి చెందారు.
పాకిస్థాన్ లోని తాలిబన్ హఫీజ్ గుల్ బహాదుర్ గ్రూపుకు చెందిన ఉసూద్-అల్-హార్బ్ ఈ దాడికి బాధ్యత వహించింది. కానీ పాకిస్థాన్ మాత్రం న్యూ ఢిల్లీపై నిందలు వేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
పాక్ చేసిన ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్ ఆరోపణలు తీవ్రంగా ఖండించి, అవన్నీ తప్పుడు ఆరోపణలని స్పష్టం చేసింది.










