SVSN Varma In Uppada | రాకాసి అలల నుంచి తృటిలో తప్పించుకున్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు ఎస్విఎస్ఎన్ వర్మ. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతంలో అలలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
ఈ అలల ధాటికి ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యింది. దింతో అధికారులు రోడ్డుపై రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు ఉప్పాడలోని సుబ్బంపేట, కొత్తపట్నం గ్రామాల్లోకి సముద్రపు నీరు వచ్చిచేరింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీనిపై సమాచారం అందుకున్న వర్మ ఈ గ్రామాల్లో పర్యటించారు. మత్స్యకారులను కలిసి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని వర్మ తీర ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం రాకాసి అలల మూలంగా దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు. ఇదే సమయంలో అలలు ఒక్కసారిగా వర్మపైకి ఎగిసిపడ్డాయి. దింతో ఆయన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.









