Sunrisers Hyderabad post 286 runs : second biggest total in IPL history | ఐపీఎల్ లో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.
మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లుగా బౌండరీలు బాదుతూ విధ్వంసం సృష్టించారు. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 106 పరుగులు చేసి ఐపీఎల్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 రన్స్ తో మెరుపులు మెరిపించాడు.
ఇకపోతే క్లాసిన్ 34, నితీష్ కుమార్ రెడ్డి 30 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆరు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది సెకండ్ హైయెస్ట్ స్కోర్. తొలి స్థానంలో కూడా హైదరాబాదే ఉంది. మరోవైపు రాజస్థాన్ లో జోఫ్రా ఆర్చర్ వేసిన నాలుగు ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు. ఐపీఎల్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక రన్స్ ఇచ్చిన బౌలర్ గా ఆర్చర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.