Sun Risers Hyderabad IPL-2025 Full Schedule | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 18వ సీజన్ కు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ వచ్చేసింది.
మార్చి 22 నుంచి మే 25వరకు ఐపీఎల్ అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమయ్యింది. కోల్కత్త నైట్ రైడర్స్ ( KKR )-బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ( RCB ) తొలి మ్యాచులో తలపడుతాయి.
ఇకపోతే గత సీజన్ లో ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించి ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sun Risers Hyderabad ) ఈ సారి కూడా ప్రత్యర్థులపై విరుచుకుపడే బ్యాటింగ్, బలమైన బౌలింగ్ లైన్ అప్ తో సిద్ధంగా ఉంది.
మార్చి 23న హైదరాబాద్ ( Hyderabad ) వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. మార్చి 27న లక్నో తో, మార్చి 30న ఢిల్లీతో, ఏప్రిల్ 3 కోల్కత్త, ఏప్రిల్ 6న గుజరాత్, ఏప్రిల్ 12న పంజాబ్, ఏప్రిల్ 17, 23న ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 25న చెన్నై, మే 2 గుజరాత్, మే ఐదు తిరిగి ఢిల్లీతో, మే 10 కోల్కత్తతో, మే13న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మే 18న లక్నోతో ఆఖరి లీగ్ మ్యాచును సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడనుంది.