Thursday 17th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం!

కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం!

Siddaramaiah took oath as karnataka cm
  • హాజరైన పలువురు ప్రతిపక్ష ముఖ్యమంత్రులు
  • తెలుగు రాష్ట్రాల సీఎంలకు అందని ఆహ్వానం

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శనివారం కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య రెండోసారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సిద్ధరామయ్యతో ప్రమాణ స్వీకారం చేయించారు.

2013లో సిద్ధరామయ్య తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు హిమాచల్‌ సీఎం సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ సహా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్దరామయ్య ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

Read Also: Tollywood: వివాహబంధంతో ఒక్కటవుతున్న ప్రేమ జంట.. అక్కినేని వారి ఇంట పెళ్లిసందడి!

వీరితోపాటు అనేక ప్రతిపక్ష పార్టీలకు, వాటి నేతలకు కూడా పార్టీ ఆహ్వానం పంపింది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన డిప్యూటీ తేజస్వీ యాదవ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.  

అయితే పొరుగున ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆహ్వానం అందలేదు.

బెంగళూరులో కొత్తగా ఎన్నికైన కర్ణాటక ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ హాజరయ్యారు.

మే 13న వెల్లడైన అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 224 స్థానాలకు గానూ 135 సీట్లు గెలుచుకొని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అధికారంలో ఉన్న బీజేపీ కేవలం 66 సీట్లు గెలుపొందింది. హంగ్ వస్తే కింగ్ మేకర్ కావొచ్చనుకొని ఆశలు పెట్టుకున్న కుమారస్వామి పార్టీ జేడీఎస్ కేవలం 19 స్థానాలతోనే సరిపెట్టుకుంది.

RBI కీలక నిర్ణయం.. రూ. 200‌0 నోటుకు చెల్లుచీటీ!

కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో సీఎం పదవి కోసం పార్టీలో హైడ్రామా నడిచింది. సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ లు ఇద్దరూ రేసులో ఉండటంతో ఎవరికి పగ్గాలు అప్పజెప్పాలనే విషయంలో అధిష్టానం తర్జన భర్జన పడింది.

చివరికి ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించి, శివకుమార్ ను ఒప్పించారు. దీంతో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవి, శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు.

ఈరోజు ప్రమాణ స్వీకారం వేడుకకు ముందు, రాహుల్ గాంధీ, శివకుమార్, మరియు సిద్ధరామయ్య ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఐక్యతను ప్రదర్శించారు.

You may also like
BJP Kishan REddy
ఆ అవసరం మాకు లేదు.. కాంగ్రెస్ నేతలకు కిషన్ రెడ్డి కౌంటర్!
mahesh goud
‘ఎమ్మెల్యేలు సంతలో పశువులు కాదు..’
komatireddy venkat reddy
హత్యా రాజకీయాలు చేయడమేనా మీ గ్రాఫ్ కేసీఆర్?
kcr revanth
కేసీఆర్ కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions