Shubman Gill’s Post After Win Against RCB Goes Viral | ఐపీఎల్ 2025లో బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచులో సొంత మైదానంలో ఆర్సీబీని జీటి మట్టికరిపించింది.
మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శుభ్‌మన్ గిల్ చేసిన పోస్ట్ ద్వారా విరాట్ కోహ్లీ, ఆర్సీబీ అభిమానులకు కౌంటర్ ఇచ్చారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ‘మేము గేమ్ పైనే దృష్టి పెడుతాం. శబ్దంపై కాదు’ అని గిల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారడానికి ఓ కారణం ఉంది. తొలి రెండు మ్యాచుల్లో గెలిచి జోష్ లో ఉన్న ఆర్సీబీ బుధవారం తమ సొంత మైదానం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ తో తలపడింది.
అయితే మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ అభిమానులు తమ జట్టుకు భారీగా మద్దతిచ్చారు. ఆర్సీబీ ప్లేయర్లు బౌండరీలు బాదిన సమయంలో నినాదాలతో స్టేడియాన్ని హోరెత్తించారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ సందర్భంగా శుభ్‌మన్ గిల్ వికెట్ ను భువనేశ్వర్ కుమార్ తీశాడు.
ఈ సమయంలో విరాట్ కోహ్లీ చేసిన సంబరాలకు అభిమానులు పెద్ద శబ్దంతో మద్దతుపలికారు. కాని మ్యాచ్ అనంతరం ‘శబ్దంపై కాదు..మేము మ్యాచ్ పైనే దృష్టి పెడుతాం’ అని గిల్ పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో గిల్ చేసిన వ్యాఖ్యలు ఆర్సీబీ, కోహ్లీకి కౌంటర్ గానే చేసారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.