Shahid Afridi praises Rahul Gandhi amid India-Pakistan handshake row | కాంగ్రెస్ అగ్ర నాయకులు, లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది.
ఆసియా కప్-2025లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెల్సిందే. ఇందులో భారత్ ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు తమ దేశ ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవడం పట్ల పాక్ మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అఫ్రిది స్పందించాడు.
ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న అతడు బీజేపీ నేతృత్వంలోని భారత ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కాడు. బీజేపీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం డర్టీ పాలిటిక్స్ చేస్తుందని పేర్కొన్నాడు. ఎప్ప్పుడూ మత రాజకీయాలు చేస్తుందని, హిందూ-ముస్లిం కార్డు వాడి అధికారంలో ఉండాలని చూస్తుందన్నాడు.
ఇదే సమయంలో రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ..ఆయనది పాజిటివ్ మైండ్ సెట్ అని కొనియాడారు. రాహుల్ ఎప్పుడూ వాస్తవాలే మాట్లాడతారని తెలిపాడు. నిరంతరం ప్రజలతో టచ్ లో ఉంటూ, న్యాయం కోసం పోరాడుతారని చెప్పాడు. సంభాషణల ద్వారా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తారని అఫ్రిది చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.









