Saturday 10th May 2025
12:07:03 PM
Home > తెలంగాణ > దళిత మహిళపై ఇంత దాష్టీకమా? : షాద్ నగర్ ఘటనపై కేటీఆర్

దళిత మహిళపై ఇంత దాష్టీకమా? : షాద్ నగర్ ఘటనపై కేటీఆర్

Police Brutality Aganist Dalit Women In Shadnagar | షాద్ నగర్ ( Shadnagar ) పోలీస్ స్టేషన్ లో ఓ దళిత మహిళపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పోలీసులు తీరు పట్ల ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో స్పందించిన బీఆరెస్ ( Brs ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( Congress ) కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులుచేరిగారు.

” దళిత మహిళపై ఇంత దాష్టీకమా?
ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?
దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ( Third Degree ) ప్రయోగిస్తారా?
మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?
నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..!
ఇంత కర్కశత్వమా… సిగ్గు సిగ్గు..!
కొడుకు ముందే చిత్ర హింసలా?
రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితా? ” అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే..పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారని నిప్పులుచేరిగారు. షాద్ నగర్ లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమని ఈ ఘటనను కేటీఆర్ ఖండించారు.

You may also like
Sajjanar
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన!
‘కొత్త పార్టీ ప్రచారంపై హరీష్ రావు రియాక్షన్’
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions