Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > తెలంగాణకు రండి.. పెట్టుబడి పెట్టండి : NRIలతో సీఎం రేవంత్

తెలంగాణకు రండి.. పెట్టుబడి పెట్టండి : NRIలతో సీఎం రేవంత్

Cm Revanth USA Tour | ఇక తెలంగాణకు రండి.. పెట్టుబడి పెట్టండి , అభివృద్ధిలో భాగస్యామ్యం పంచుకొండని ప్రవాస భారతీయుల ( NRI )కు సీఎం రేవంత్ ( Cm Revanth ) పిలుపునిచ్చారు.

అమెరికా ( USA ) పర్యటనలో భాగంగా ఆదివారం న్యూజెర్సీ లో ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు.

తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్ గా లభిస్తుందని చెప్పారు.

తమ పరిపాలనపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు తావు లేదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకు వస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

You may also like
ఒకే ఫ్రేమ్ లో సీఎం రేవంత్, బండి సంజయ్
సస్పెన్స్ కు తెర..తెలంగాణకు నూతన పీసీసీ చీఫ్
ktr pressmeet
హరీష్ రావు కారుపై రాళ్లదాడి..కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం ?..ఆ సినిమాపై నిషేధం ?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions