Friday 30th January 2026
12:07:03 PM
Home > తెలంగాణ > బుల్లెట్‌ వదిలి బ్యాలెట్‌ పట్టిన సీతక్క

బుల్లెట్‌ వదిలి బ్యాలెట్‌ పట్టిన సీతక్క

Seethakka left the bullet and took the ballot

-ముళ్లబాటలో సీతక్క ప్రయాణం
– రాజకీయాల్లో ఎన్నో కష్టాలతో ప్రజాసేవ
– ప్రజాసేవలో ఆమెను మించిన వారు లేరేమో
– విద్యాను కొనసాగించి.. న్యాయవాదిగా మారి

ములుగు: ధనసరి అనసూయ అలియాస్‌ సీతక్క గురించి తెలియని వారు ఉండరు. ఆదివాసీ కోయ జాతికి చెందిన ఈమె తెలుగు రాష్టాల్ర ప్రజలకు సుపరిచితమే. ఆమె జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. తెలంగాణ రాజకీయాల్లో సీతక్కది ప్రత్యేక స్థానం. విద్యార్థి దశ నుంచే పోరాటం మొదలు పెట్టారు. ఆ తర్వాత దళంలో చేరి అన్నలతో కలిసి ప్రభుత్వం విరీద పోరాటం చేశారు. అక్కడ మారిన సిద్దాంతాలు పొసగక బయటికి వచ్చారు. సాయుధ పోరాటాల కంటే ప్రజల్లో ఉండి పోరాడటమే మేలనుకుని జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. రాజకీయాల్లో చేరడానికి ముందు 15ఏళ్లకుపైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సల్కెటు సీతక్క.. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గంలో చోటుదక్కించుకు న్నారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నక్సల్కెట్‌ జీవితం నుంచి లాయర్‌గా.. ఆపై ఎమ్మెల్యేగా… ఆ తర్వాత ప్రజాదరణ పొందిన నాయకురాలిగా గుర్తింపుతెచ్చుకున్న సీతక్క ఇప్పుడు.. కేబినెట్‌ మంత్రి స్థాయికి ఎదిగిరారు. ముళ్ల బాటలను దాటుకుండా.. ప్రజాసేవకు సరైన మార్గం ఎన్నుకుంటూ… ఉన్నత స్థాయికి చేరుకున్నారు. తుపాకీ తూట కంటే అంబేడ్కర్‌ బాటలో పయనిస్తే ప్రజల బతుకుల్లో మార్పు తీసుకురావచ్చని భావించారు. గిరిజన మహిళలకు ఉపాధినిచ్చే ప్రభుత్వ సంస్థలో చేరి ఉద్యోగం చేసుకుంటూ సామజికసేవ వైపు పయనం సాగించారు సీతక్క. ఆపై రాజకీయాల్లోకి వచ్చారు. పాలిటిక్స్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. తెలుగుదేశంలో చేరి ములుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. సొంత నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వచ్చారు. ప్రజల పక్షాన పోరాడారు. ఇటు రాజకీయాల్లో, అటు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా నక్సల్కెట్‌ జీవితం నుంచి.. ఇప్పుడు మంత్రిగా ఎదిగారు సీతక్క. ములుగు నియోజకవర్గంలో ఆమె ప్రజలకు ఎంతగా చేరువయ్యారో ఆమె చేసిన సేవలే నిదర్శనం. కరోనా కష్టకాలంలో ఆమె గరిజనులకు అండగా నిలిచారు. 1971, జూల్కె 9న.. వరంగల్‌ జిల్లా ములుగు మండలం జగ్గన్నగూడెంకి చెందిన సమ్మక్క` సమ్మయ్య దంపతులకు జన్మించారు సీతక్క. ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో చదువుకుంటున్న సమయంలోనే పోరాటంలోకి వెళ్లారు సీతక్క. గిరిజన వసతి గృహంలో సరిగా భోజనం పెట్టడం లేదని, బాలికలకు ప్రభుత్వం ఇస్తున్న పది రూపాయలను వసతి గృహ అధికారులు ఇవ్వడం లేదని తోటి విద్యార్థులను కూడగట్టుకుని ధర్నా చేశారు.. అప్పుడు ఆమె వయస్సు 13ఏళ్లు. ఆమె పోరాటపటిమను గుర్తించిన పీపుల్స్‌ వార్‌ దళం సభ్యుల పిలుపుతో…14ఏళ్ల వయస్సులోనే అడవిబాట పట్టారు. 1988లో 10వ తరగతి చదువుతుండగానే నక్సల్స్‌ పార్టీలో చేరారు. మావోయిస్టుల్లో చేరినా చదువు వదల్లేదు సతీక్క. పోలీసుల అరెస్ట్‌ చేసినా… జ్కెల్లో ఉంటూనే పదో తరగతిలో ఫెయిల్‌ అయిన స్జబెక్టులకు పరీక్షల రాసి పాస్‌ అయ్యారు. ఆ తర్వాత… ప్రేమించిన తన బావనే పెళ్లాడారు సీతక్క. రెండు నెలల కుమారుడిని వేరేవాళ్ల చేతుల్లో పెట్టి మళ్లీ అడవిబాట పట్టారు. జన నాట్యమండలి ద్వారా ఆదివాసీల సమస్యలపై పోరాటం చేశారు. 20ఏళ్ల పాటు నక్సల్కెట్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు సీతక్క. ఆ తర్వాత సీతక్క దంపతుల మధ్య విబేధాలు రావడం.. దళంలో మారిన సిద్దాంతాలు నచ్చక 1996లో బయటికి వచ్చేశారు సీతక్క. ఆ తరువాత ఐటిడీఏలో నెల జీతానికి పనిచేస్తూ చదువు కొనసాగించారు. ఎన్టీఆర్‌ పిలుపుతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన సీతక్క..
అన్యాయం మీద పోరాడాలంటే న్యాయశాస్త్రం మీద పట్టు సాధించాలని భావించారు. అందుకోసం.. 2001లో సీతక్క ఎల్‌ఎల్బీ చదివారు. ఈ క్రమంలోనే ప్రజా విధానం, పాలనపై సీతక్కలో ఆసక్తి పెరిగింది. సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొంటూ.. జనం మెచ్చిన నాయకురాలిగా మారారు. ఆమె చేస్తున్న పనులు, ఆమెకు జనంలో ఉన్న ఫాలోయింగ్‌ చూసి.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు సీతక్కకు టీడీపీలోకి ఆహ్వానించారు. 2004 ఎన్నికల్లో ములుగు టికెట్‌ కూడా ఇచ్చారు. కాగా.. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన సీతక్క.. కాంగ్రెస్‌ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. అయినాసరే నిరాశచెందకుండా.. మళ్లీ 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా మళ్లీ ములుగు నుంచే పోటీ చేసి పొదెం వీరయ్యపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇక.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లోనూ మళ్లీ టీడీపీ నుంచే పోటీ చేసిన సీతక్క.. మళ్లీ ఓటమి పాలయ్యారు. ఇక అప్పటికే.. తెలంగాణలో టీడీపీ బలహీనపడటం, తెలుగు తమ్ముళ్లు కూడా రాజకీయ భవిష్యత్తు కోసం తలో దారి వెతుక్కోవటంతో.. సీతక్క కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున మళ్లీ ములుగు నుంచే పోటీ చేసిన సీతక్క.. భారీ మెజార్టీతో గెలుపొందారు. అటు కాంగ్రెస్‌ పార్టీలోనూ.. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలిగా నియామకమయ్యారు. ఇక కరోనా సమయంలో కాలినడకన గుట్టలు, వాగులు దాటి మరీ గిరిజనుల ఆకలి తీర్చిన విధానం.. ప్రత్యర్థుల చేత కూడా శెభాష్‌ అనిపించింది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ధ్కెర్యంగా ఎదురిస్తూ.. అరెస్టులు, కేసులకు భయపడకుండా ప్రజాపక్షంగా పోరాడారు. ఆమె ధ్కెర్యానికి తెగువకు ఆమె అభిమానులు పెట్టుకున్న పేరు.. ఐరన్‌ లేడీ ఆఫ్‌ తెలంగాణ. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున అదే ములుగు నుంచి బరిలోకి దిగి.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే జ్యోతిపై ఏకంగా 33,700 మెజార్టీతో తన సత్తా చాటారు. కాగా.. పార్టీలో టీపీసీసీగా ఉన్న రేవంత్‌ రెడ్డితో సీతక్కకు టీడీపీ నుంచే పరిచయం ఉండగా.. ముందు నుంచి వాళ్లిద్దరి మధ్య అన్నాచెల్లెల్లి బంధం ఏర్పడిరది. రేవంత్‌ రెడ్డి కూడా సీతక్కను తన సోదరిగా పలు వేదికలపై చెప్పటం గమనార్హం. మరోవైపు రాహుల్‌ గాంధీ కూడా సీతక్కను సోదరిగా పేర్కొనటం విశేషం. తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని కూడా ములుగు జిల్లా నుంచే మొదలుపెట్టారు. సీతక్కకు తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాస్‌ ఫాలోయింగ్‌.. పార్టీలో ఉన్న ఆదరణ.. ఈరోజు సీతక్కను మంత్రిగా నిలబెట్టాయి. కాగా.. సీతక్కకు గిరిజన శాఖను సీఎం రేవంత్‌ రెడ్డి కేటాయించారు..

You may also like
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions