Sanatana Dharma Parirakshana Board | సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాగా తిరుమల శ్రీవారి ప్రసాదం అయిన లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించినట్లు సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నిర్ధారించింది. భోలేబాబా ఓరోగానిక్ డెయిరీ ప్రత్యక్షంగా, పరోక్షంగా 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు ప్రత్యేక బృందం పేర్కొంది.
తిరుమల లడ్డూ అంశంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన తరుణంలో పవన్ స్పందిస్తూ కీలక పోస్ట్ చేశారు. ‘విశ్వ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్ర ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. తిరుపతి లడ్డూ కేవలం ఒక తీపి వంటకం కాదు; ఇది పరమ పవిత్రమైన ప్రసాదం – భక్తులు దీనిని స్నేహితులు, కుటుంబం మరియు ఇతరులతో పంచుకుంటారు. ఇది భక్తుల బలమైన నమ్మకం మరియు భక్తిని సూచిస్తుంది. సగటున, సంవత్సరానికి సుమారు 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తారు. సనాతనధర్మ ప్రజల మనోభావాలను, ఆచారాలు ఎగతాళి చేసినప్పుడు కేవలం బాధాకరం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యొక్క విశ్వాసం మరియు భక్తిని ఛిన్నాభిన్నం చెయ్యడమే. సెక్యులరిజం రెండు వైపులా పనిచేయాలి. మా విశ్వాసానికి రక్షణ మరియు గౌరవం అనేది కచ్చితంగా కావాలి. మా సనాతన ధర్మం అత్యంత పురాతనమైన మరియు నిరంతరం అభివృద్ధి చెందుతున్న సంస్కృతులలో ఒకటి, ఇప్పుడు మనం అందరి సమ్మతితో సమ్మతితో “సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు”ను స్థాపించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పవన్ పేర్కొన్నారు.










