Wednesday 4th March 2026
12:07:03 PM
Home > తాజా > ‘గ్రూప్-3 పరీక్షలో కులతత్వ ప్రశ్నలా ?’

‘గ్రూప్-3 పరీక్షలో కులతత్వ ప్రశ్నలా ?’

RS Praveen Kumar On Group-3 Question Paper | తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆరెస్ నాయకులు ఆరెస్ ప్రవీణ్ కుమార్. గ్రూప్ 3 పరీక్షలో కులతత్వ ప్రశ్నలా అంటూ నిలదీశారు.

కాగా ఇటీవల నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలో భారతదేశంలో సంస్కృతీకరణ అనే ప్రశ్నలో తక్కువ కులం పద్ధతులు అంటూ ఒక ప్రశ్న కింద ఆప్షన్స్ వచ్చాయి. ఈ క్రమంలో ఆరెస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. గ్రూప్ 3 పరీక్షలో కులతత్వ ప్రశ్నలు ఏంటని ఆయన టీజీపీఎస్సి ( TGPSC ) ని ప్రశ్నించారు.

స్వాతంత్ర్యం అనంతరం ‘అమృత్ కాల్’ లో కూడా కుల వివక్ష వర్ధిల్లుతుందనే దాంట్లో ఎటువంటి ఆశ్చర్యం లేదన్నారు. అలాగే ‘ High caste, Low caste, తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలు ప్రభుత్వ పరీక్షా పత్రాల్లోనే ఉంటే ఇంక సామాజిక న్యాయం ఎట్ల వస్తది రేవంత్ రెడ్డి గారూ? మీ సమీకృత విద్యా విధానం చిలుక పలుకులు కేవలం వట్టి మాటలే, నీటి మూటలే ‘ అంటూ ముఖ్యమంత్రిని విమర్శించారు.

You may also like
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’
టీటీడీ ఛైర్మన్ వైరల్ వీడియోలు..స్పందించిన బీఆర్ నాయుడు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions