RRB Technician Recruitment 2024 | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. భారతీయ రైల్వే (Indian Railways)లో దేశవ్యాప్తంగా వివిధ జోన్లకు కలిపి మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ కోసం 1092, టెక్నీషియన్ గ్రేడ్ III కోసం 8052 పోస్టులు ఉన్నాయి. మార్చి 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 8 2024 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
TS Lawcet -2024 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే!
అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా సడలింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అర్హత గల అభ్యర్థులకు పరీక్ష షెడ్యూల్ తర్వాత మిగతా ప్రక్రియలు ఉంటాయి. విద్యార్హత, దరఖాస్తు ఫీజు, వేతనం తదితర పూర్తి వివరాల కోసం RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.