Rohit Sharma Spotted at Kokilaben Hospital Late Night | టీం ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆసుపత్రికి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సోమవారం అర్ధరాత్రి రోహిత్ శర్మ ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలోనికి వెళ్లారు. అక్కడే ఉన్న మీడియా రోహిత్ ను పలు ప్రశ్నలు అడిగింది. అయితే ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే రోహిత్ ఆసుపత్రి లోపలికి వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు రోహిత్ శర్మ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళాడు అని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. అక్టోబర్ 19న టీం ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
ఇందులో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ-20 లు ఆడనుంది. టెస్టులు, టీ-20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేల్లో మాత్రం సారథ్యం వహించనున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా టూర్ ఉన్న క్రమంలో రోహిత్ ఆసుపత్రికి వెళ్లడం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.









