Rohith Sharma Apologies | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) లో భాగంగా టీం ఇండియా (Team India) తొలి మ్యాచులో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా (Bangladesh) 228 పరుగులకు ఆల్ ఔట్ అవ్వగా, భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
అయితే తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) క్యాచ్ మిస్ చేయడంతో బౌలర్ అక్షర్ పటేల్ (Aksar Patel) హ్యాట్రిక్ మిస్ అయ్యాడు. దీనిపై మ్యాచ్ అనంతరం రోహిత్ స్పందిస్తూ..అక్షర్ పటేల్ కు క్షమాపణలు చెప్పారు.
‘అది సులువైన క్యాచ్, నేను కూడా సిద్ధంగానే ఉన్నా. అయినప్పటికీ అలా జరిగిపోయింది. హ్యాట్రిక్ మిస్ చేసినందుకు అక్షర్ కు క్షమాపణలు. బహుశా అతన్ని డిన్నర్ కు తీసుకెళ్తా అనుకుంటున్నా’ అంటూ రోహిత్ పేర్కొన్నారు.
కాగా తొలి ఇన్నింగ్స్ 9వ ఓవర్ ను అక్షర్ వేశాడు. రెండవ బాల్ కు ఓపెనర్ తంజిద్ ను ఔట్ చేశాడు. తర్వాత బంతికి బ్యాటర్ ముషఫికర్ ను పెవిలియన్ పంపాడు. హ్యాట్రిక్ బాల్ ను ఎదురుకున్న జకేర్ అలీ కూడా స్లిప్ లో క్యాచ్ ఇచ్చాడు. అయితే ఈ క్యాచ్ ను రోహిత్ శర్మ మిస్ చేశాడు.