Rishabh Pant Becomes Third Indian To Take 150 Test Catches As Wicketkeeper | టీం ఇండియా ప్లేయర్ రిషబ్ పంత్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
ఇంగ్లాండ్-ఇండియా మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెల్సిందే. ఆదివారం జరిగిన మ్యాచులో రిషబ్ తన టెస్టు కెరీర్ లో 150వ క్యాచ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన మూడవ ఇండియన్ వికెట్ కీపర్ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ లో ఓలి పోప్ సెంచరీతో చెలరేగిపోయాడు.
అయితే ప్రసిద్ కృష్ణ వేసిన బంతి పోప్ బ్యాటుకు తాకి , కీపర్ వైపు వెళ్ళింది. వచ్చిన బంతిని పంత్ ఒడిసి పట్టుకుని తన టెస్టు కెరీర్ లో 150వ క్యాచ్ ను పూర్తి చేసుకున్నాడు. పంత్ కంటే ముందు 160 క్యాచులతో సయ్యద్ కీర్మాణి, 256 క్యాచులతో ఎంఎస్ ధోని పంత్ కంటే ముందున్నారు.
ప్రస్తుతం పంత్ 151 క్యాచులు, 15 స్టంపింగ్స్ చేశాడు. ధోని 256 క్యాచులు, 38 స్టంపింగులతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ తో చెలరేగిన పంత్ టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు.