RGV Tweet On Barrelakka | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొల్లాపూర్ (Kollapur) నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బర్రెలక్క (Barrelakka) అలియాస్ శిరీషకు అనూహ్య మద్దతు లభిస్తోంది.
ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ కంచె అయిలయ్య లాంటి ప్రముఖులతోపాటు విద్యార్థులు, నిరుద్యోగులు ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.
ఆమె గెలుపు ఓటమి పక్కన పెడితే బర్రెలక్క క్రేజ్ మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది.
తాజాగా ప్రముఖ దర్శకుడు, వివాదాల కేంద్ర బిందువు రాంగోపాల్ వర్మ (Ramgopal Varma) కూడా శిరీష గురించి కొల్లాపూర్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క పై వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
బర్రెలక్కను మహాత్మా గాంధీతో పోలుస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో మహాత్మాగాంధీ మొదటగా అన్యాయంపై పోరాటం చేశారని, దానిపైనే ప్రస్తుతం బర్రెలక్క కూడా యుద్ధం చేస్తుందని పొగిడారు.
దీంతో వర్మకు నెటిజెన్లు రిప్లై ఇస్తూ జీవితంలో మీరు మొదట చేసిన మంచిపని ఇదే అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు వర్మది పొగడ్తో సెటైరో అర్థం కాదంటూ రిప్లై ఇస్తున్నారు.









