Friday 27th June 2025
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ ప్రజలకు కాబోయేసీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ!

తెలంగాణ ప్రజలకు కాబోయేసీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ!

revanth reddy

Revanth Reddy Letter To People | తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానీకానికి బుధవారం బహిరంగ లేఖ రాశారు. గురువారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రెండో సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ప్రజలందరికీ ఆహ్వానం పలికారు.

లేఖలో ముందుగా తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనీయా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శకపాలన అందించేందుకు.. బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రజల ఆశీస్సులు కావాలని విజ్ఞప్తి చేశారు.

అందుకే 2023, డిశంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయబోతోంది అని సందేశాన్ని ఇచ్చారు. ఈ మహోత్సవానికి ప్రజలందరూ రావల్సిందిగా ఇదే నా ఆహ్వానం’ అని లేఖలో రాసుకొచ్చారు రేవంత్ రెడ్డి.

You may also like
cm revanth reddy
‘ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం గిరిజనులకు వరం’
cm revanth
బెట్టింగ్ యాప్ లపై సీఎం రేవంత్ కీలక ప్రకటన!
cm revanth reddy
‘వీళ్లు అనాథలు కాదు.. రాష్ట్ర సంపద’
అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions