Delhi Restaurant | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఓ జంటకు రెస్టారంట్లో చేదు అనుభవం ఎదురైంది. భారతీయ వస్త్రధారణతో (Indian Tradition Dress) వెళ్లినందుకు రెస్టారంట్ సిబ్బంది తమను అనుమతించలేదని ఆ జంట ఆరోపించింది.
నగరంలోని పితాంపురలోని ఓ రెస్టారంట్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రెస్టారంట్లోకి ఇతరులను అనుమతించారు కానీ, తమతో మాత్రం మేనేజర్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆ జంట ఆరోపించింది.
అయితే ఈ వ్యవహారంపై స్పందించిన రెస్టారంట్ యజమాని నీరజ్ అగర్వాల్ తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తోసిపుచ్చారు. రెస్టారెంట్ ఆ జంట టేబుల్ బుక్ చేసుకోలేదని, అందుకే వారిని లోపలికి అనుమతించలేదని తెలిపారు. రెస్టారంట్లో ఎలాంటి వస్త్రధారణ నియమం లేదని, అందరినీ ఆహ్వానిస్తామని చెప్పారు.









