Jio Cloud Storage | జియో (Jio) కస్టమర్లకు యాజమాన్యం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గురువారం జరిగిన రిలయన్స్ (Reliance) 47వ వార్షిక సాధారణ సమావేశంలో అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ప్రకటన చేశారు.
ఈ ఏడాది దీపావళి నుంచి ఏఐ క్లౌడ్ స్టోరేజీ సేవలను ప్రారంభించనున్న నేపథ్యంలో వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వెల్‌కం ఆఫర్ కింద యూజర్ల కు 100జీబీ ఉచిత స్టోరేజీని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలు వంటి డిజిటల్ కంటెంట్‌ను జియో యూజర్లు సురక్షితంగా దాచుకునేలా జియో క్లౌడ్ స్టోరేజీని తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.
వెల్‌కం ఆఫర్ కింద 100జీబీ క్లౌడ్ స్టోరేజీని ఫ్రీగా అందించనున్నట్లు తెలిపారు. ఇంకా అధిక మోతాదులో క్లౌడ్ స్టోరేజీ కావాలనుకునే వారికి తక్కువ ధరల్లోనే అందిస్తామని చెప్పారు. ఏఐ సేవలు అందరికీ అందుబాటులోకి రావాలనేదే తమ ఉద్దేశమని ఆయన వెల్లడించారు. తక్కువ ధరకే ఏఐ మోడల్ సర్వీసులను అందిస్తామని పునరుద్ఘాటించారు.