- తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై చర్చ
Raghuram Rajan Meets CM | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురాం రాజన్. ఆదివారం నాడు జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసం లో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాగా కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్, సీఎం తో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
అలాగే ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు రఘురాం రాజన్. తెలంగాణ రాష్ట్రానికి భారీగా అప్పులు ఉండటం, మరోవైపు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు ఏటా రూ.60 వేల కోట్లు అవసరం పడుతుందనే అంచనా ఉంది.
ఈ నేపథ్యంలో సంక్షేమంతోపాటు ఆర్థిక అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ప్రకటించారు కాంగ్రెస్ నాయకులు. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.