N. Ramchander Rao to take charge as BJP State president | తెలంగాణ బీజేపీ పగ్గాలను చేపట్టారు మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు.
ఈ మేరకు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధికారికంగా ప్రకటించారు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్రమంత్రి శోభా కరంద్లాజే. అనంతరం రామచందర్ రావుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు కిషన్ రెడ్డి నుండి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్ మరియు ఇతర నాయకులు నూతన అధ్యక్షున్ని సత్కరించారు. బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాయకులందరూ రామచందర్ రావుతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి.









