Ram Charan Thanks Pawan Kalyan | గ్లోబల్ స్టార్ రాం చరణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేశారు.
రాం చరణ్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కించిన మూవీ గేమ్ ఛేంజర్ ( Game Changer ). జనవరి 10న మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో శనివారం రాజమండ్రిలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘రాం చరణ్ బంగారం, ఒక తల్లికి పుట్టకపోయినా నా తమ్ముడు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు. భవిష్యత్ లో చరణ్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఒక బాబాయిగా కాదు, ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నా. లవ్ యు చరణ్ ( Love You Charan )’ అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో రాంచరణ్ స్పందిస్తూ..’ డిప్యూటీ సీఎం పవన్ గారు..మీ తనయుడిగా, నటుడిగా, భారత పౌరుడిగా మిమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నా. నా వెన్నంటే ఉన్నందుకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తునందుకు ధన్యవాదాలు’ అని గ్లోబల్ స్టార్ థాంక్స్ ( Thanks ) చెప్పారు.