Rajendra Prasad Comments On David Warner | ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన మూవీ ‘రాబిన్ హుడ్’ లో వార్నర్ నటించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వార్నర్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ..’మా డైరెక్టర్, హీరో నితిన్ కలిసి వార్నర్ ను తీసుకువచ్చారు. ఆయన్ను క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్పులేస్తాడు. రేయ్ వార్నర్..బీ వార్నింగ్’ అంటూ స్టేజిపై రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ పట్ల నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఇలా అనుచితంగా, అగౌరపరిచేలా మాట్లాడడం సరికాదని సూచిస్తున్నారు. రాజేంద్రప్రసాద్ సరదాగానే మాట్లాడినా ఆయన వాడిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.