Rajamouli Post About SSMB29 | సూపర్ స్టార్ మహేష్ బాబు ( Superstar Mahesh Babu ) దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ ( Combination ) లో #SSMB29 తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.
యాక్షన్ అడ్వెంచర్ ( Action Adventure ) నేపథ్యంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ ( Pre Production ) పనులపై యూనిట్ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రాజమౌళి ఓ ఆసక్తికర పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సింహాన్ని బోనులో బంధించి పాస్పోర్ట్ ( Passport ) ను చూపిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. ఈ పోస్టుకు ‘క్యాప్చర్’ అనే కాప్షన్ ను ఆయన పెట్టారు. ఈ క్రమంలో SSMB29 షూటింగ్ నిమిత్తం మూవీ టీం విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రాజమౌళి పోస్ట్ చేసిన వీడియో క్షణాల వ్యవధిలోనే వైరల్ గా మారింది. ఈ పోస్టుపై మహేష్ బాబు కూడా స్పందించారు. ‘ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అని తన మార్కు డైలాగ్ ను కామెంట్ చేశారు.
ఇకపోతే నటి ప్రియాంక చోప్రా ( Priyanka Chopra ) కూడా ఫైనల్లీ అంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నట్లు వస్తున్న వార్తలకు బలాన్ని చేకూర్చినట్లైంది.