Rain Alert for Telangana | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం ఎండ ధాటికి ప్రజలు బయటికి రావడానికే జంకుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత ముదురుతున్నాయి. ఈ సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది.
తెలంగాణలో ప్రజలు ఎండల నుండి ఉపశమనం పొందేందుకు కొద్ది రోజుల తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏప్రిల్ 1 వరకు పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి 4 మధ్య రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.









