Rahul Dravid | ఇటీవల అమెరికా – వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్ (ICC T20 Worldcup) ను భారత్ కైవసం చేసుకోవడంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కీలకంగా వ్యవహరించిన విషయం తెల్సిందే. వరల్డ్ కప్ విక్టరీ నేపథ్యంలో టీం ఇండియాకు రూ.125 కోట్ల భారీ నజరానాను బీసీసీఐ ప్రకటించింది.
అయితే తనకు వచ్చిన బోనస్ విషయంలో రాహుల్ ద్రావిడ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇండియా ఐసీసీ ట్రోఫీని గెలవడంతో బీసీసీఐ 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది.
ఇందులో టీం లోని 15 మంది ప్లేయర్లకు రూ. 5 కోట్లు, రిజర్వ్ ప్లేయర్స్ కు రూ. కోటి చొప్పున అందించారు. అలాగే హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కు రూ.5 కోట్లు ప్రకటించారు. కానీ, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ లకు రూ.2.5 కోట్లు బీబీసీసీ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో రాహుల్ ద్రావిడ్ తన బొనస్ ను సగానికి తగ్గించాలని కోరినట్లు తెలుస్తోంది. అందరికి సమానంగా బోనస్ ను పంచాలని బీసీసీఐ ని కోరినట్లు సమాచారం.