Thursday 9th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పుదుచ్చెరి ఎన్నికల్లో ఓటర్లకు ‘నీలా’అపూర్వ స్వాగతం.. ఎవరో తెలుసా!

పుదుచ్చెరి ఎన్నికల్లో ఓటర్లకు ‘నీలా’అపూర్వ స్వాగతం.. ఎవరో తెలుసా!

Neela Robot

Nila Robot In Puducherry Elections 2026 | పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం ఒక ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. వీఓసీ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లకు ఓ అతిథి అపూర్వ స్వాగతం పలికింది.

‘నీలా’ అనే హ్యూమనాయిడ్ రోబో ఓటర్లను స్వాగతిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. కోయంబత్తూర్‌కు చెందిన ‘రోబో మిర్రర్’ సంస్థ అభివృద్ధి చేసిన ఈ రోబో, అచ్చమైన భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టులో ఓటర్లను ఆహ్వానించింది.

కేవలం బొమ్మలా నిలబడటమే కాకుండా.. తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఓటర్లతో ముచ్చటిస్తూ, వారికి అవసరమైన సహాయం చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

“ఈ రోబోకు వాయిస్ ఫీచర్ ఉంది. మేము ఇచ్చే కమాండ్ల ద్వారా ఇది ఓటర్లకు అర్థమయ్యేలా మాట్లాడుతుంది” అని రోబో మిర్రర్ ప్రతినిధి కౌశిక్ తెలిపారు. ప్రస్తుతం ఈ నీలా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పుదుచ్చేరితో పాటు కేరళ, అస్సాం రాష్ట్రాల్లోనూ ఈరోజు ఉదయం 7 గంటల నుండే పోలింగ్ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఓటర్లందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ముఖ్యంగా యువత, మహిళలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions